Andhra Pradesh: జగన్ మంత్రి పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీకి విధేయుడిగా ఉంటా!: తమ్మినేని సీతారాం

  • నాకు పార్టీయే ముఖ్యం.. పదవులు కాదు
  • మంత్రి పదవి విషయంలో జగన్ దే తుదినిర్ణయం
  • శ్రీకాకుళంలో మీడియాతో వైసీపీ నేత

వైసీపీ నేత తమ్మినేని సీతారాంకు ఈసారి మంత్రి పదవి ఖాయమని మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై ఆయన స్పందించారు. తనకు పార్టీయే ముఖ్యమనీ, పదవులు ముఖ్యం కాదని సీతారాం స్పష్టం చేశారు. మంత్రి పదవులు, బాధ్యతలపై ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ దే తుది నిర్ణయమని ప్రకటించారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీకి విధేయడిగానే ఉంటానని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సీతారాం ఈరోజు మీడియాతో మాట్లాడారు.

పరిపాలన విషయంలో జగన్ ట్రెండ్ సృష్టిస్తారని తమ్మినేని సీతారాం విశ్వాసం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గమైన ఆముదాలవలసలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంతో పాటు నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో భారీ అవినీతి చోటుచేసుకుందన్న సీతారాం.. వీటన్నింటిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.

Andhra Pradesh
Jagan
YSRCP
Chief Minister
ministry
tammineni sitaram
  • Loading...

More Telugu News