CM Jagan: సాగునీటి పారుదల శాఖపై మరోసారి సమీక్ష...సీఎం జగన్ నిర్ణయం

  • శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్
  • రంజాన్ కారణంగా నిన్నటి వ్యవసాయ శాఖ సమీక్ష రద్దు
  • ఈరోజు వ్యవసాయ శాఖతోపాటు ఇరిగేషన్ శాఖలపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సాగునీటి పారుదల శాఖపై మరోసారి ఈరోజు సమీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉదయం వ్యవసాయం, అనుబంధ శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఒకసారి సాగునీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష పూర్తిచేశారు. మరోసారి ఆ శాఖాపరంగా జరిగిన పనులపై నిశిత పరిశీలన చేస్తుండడం గమనార్హం.

CM Jagan
irrigation department
again review
  • Loading...

More Telugu News