Bharat: 'భరత్' బాగుందన్న వారిపై విరుచుకుపడ్డ కంగనా రనౌత్ చెల్లెలు రంగోలీ!

  • నిన్న విడుదలైన 'భరత్'
  • ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ ప్రముఖులు
  • పొగడ్తల రాయుళ్లగా మారారన్న రంగోలీ

నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'భరత్'పై బాలీవుడ్ ప్రశంసలు కురిపిస్తున్న వేళ, కంగనా రనౌత్ సోదరి రంగోలీ మాత్రం విరుచుకుపడుతోంది. కరణ్ జోహార్ నేతృత్వంలో బాలీవుడ్ యావత్తూ సల్మాన్ ఖాన్ ను పొగడుతోందని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టింది. మనిషి ముందు పొగడుతూ, వెనక్కు వెళ్లి విమర్శలు గుప్పించడాన్ని తాను కూడా నేర్చుకోవాలని వ్యాఖ్యానించింది.

కాగా, 'భరత్' చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించగా, సినిమా చూసిన వాళ్లంతా సోషల్ మీడియాలో పొగడ్తలు కురిపించారు. సల్మాన్ ఎరేంజ్ చేసిన ప్రత్యేక ప్రదర్శనకు టైగర్ ష్రాఫ్, దిశా పటానీ, బాబీ డియాల్, సునీల్ శెట్టి, మనీష్ పాల్, నేహా ధూపియా, సన్నీ లియాన్, హుమా ఖురేషీ, ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, కుషీ కపూర్, తారా సుతారియా, ఆహాన్ పాండే తదితరులు హాజరయ్యారు.

Bharat
Salman Khan
Kangana Ranout
Rangoli Ranaut
  • Loading...

More Telugu News