Cricket: సఫారీలకు కొరకరాని కొయ్యలా మారిన రోహిత్ శర్మ... టీమిండియా 33 ఓవర్లలో 143/3
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ
- 26 పరుగులు చేసి రాహుల్ అవుట్
- కోహ్లీ వికెట్ దక్కించుకున్న ఫెలుక్వాయో
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ లక్ష్యం దిశగా సాగిపోతోంది. ఓపెనర్ ధావన్ (8) స్వల్పస్కోరుకే అవుటైనా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ (86 బ్యాటింగ్) మొక్కవోని పట్టుదలతో సఫారీ బౌలర్లను ఎదుర్కొని హాఫ్ సెంచరీ సాధించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 18 పరుగులు చేసి ఫెలుక్వాయో బౌలింగ్ లో వెనుదిరిగాడు. నిలదొక్కుకుంటున్న దశలో కేఎల్ రాహుల్ కూడా అవుటవడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 143 పరుగులు. విజయం సాధించాలంటే ఇంకా 17 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో రోహిత్ కు తోడుగా ఎంఎస్ ధోనీ ఉన్నాడు.