Uttam Kumar Reddy: శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన ఉత్తమ్

  • ఎంపీగా గెలుపొందడంతో రాజీనామా
  • స్పీకర్ పోచారంతో మాట్లాడిన ఉత్తమ్
  • అసెంబ్లీకి వెళ్లి కార్యదర్శికి రాజీనామా అందజేత

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉత్తమ్, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ముందుగా ఈ విషయమై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో మాట్లాడి, అనంతరం నేరుగా అసెంబ్లీకి వెళ్లి కార్యదర్శి నర్సింహాచార్యులకు తన రాజీనామాను అందజేశారు. ఉత్తమ్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో తన భార్య పద్మావతిని పోటీకి నిలబెట్టే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Uttam Kumar Reddy
Hujurabad
Loksabha
Pocharam Srinivas
Assembly
Narasimhacharyulu
  • Loading...

More Telugu News