Kanna Lakshminarayana: కేశినేని నాని ఇప్పటి వరకూ నాతో మాట్లాడలేదు.. మా పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారేమో: కన్నా

  • బీజేపీలో చేరేందుకు చాలా మంది సిద్ధం
  • పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తాం
  • పార్టీలో చేరే సమయంలో వివరాలు వెల్లడిస్తాం

తాను ఇప్పటి వరకూ కేశినేని నానితో మాట్లాడలేదని, అయితే తమ పార్టీ పెద్దలతో ఆయన టచ్‌లో ఉన్నారేమో అని బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాని టీడీపీని వీడి బీజేపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు.

ఇప్పటికే బీజేపీలో చేరుతామంటూ చాలా మంది తమను సంప్రదిస్తున్నారని, ఎవరు తమ పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామని అన్నారు. పార్టీలో చేరే సమయంలో వారి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ నెల 9న ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలకు రానున్నారని, ఈ నేపథ్యంలో మరో నాలుగు జిల్లాల్లో పర్యటించాలని కోరుతామని కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.

Kanna Lakshminarayana
BJP
Narendra Modi
Kesineni Nani
Tirumala
  • Loading...

More Telugu News