Narendra Modi: మోదీ వల్లే టీఆర్ఎస్ ఆ స్థానాన్ని కోల్పోయింది: టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

  • కేసీఆర్‌పై ఉన్న నమ్మకం చెక్కు చెదరలేదు
  • ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని రుజువైంది
  • బీడు భూములకు నీళ్లిచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి

మోదీ కారణంగానే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కరీంనగర్ స్థానాన్ని కోల్పోయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని పరిషత్ ఎన్నికల ద్వారా మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కు చెదరలేదన్నారు.

బీజేపీ ఎంపీ గెలవడంతో నియోజకవర్గ పరిధిలో ఆ పార్టీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారని, ఇది మంచి పధ్ధతి కాదని అన్నారు. రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ వైపే ఉంటారని కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న బీడు భూములన్నింటికీ నీళ్లిచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని కమలాకర్ తెలిపారు.

Narendra Modi
Karimnagar
KCR
TRS
Gangula Kamalakar
  • Loading...

More Telugu News