Telugudesam: ఆ విషయంలో నేను, నాని స్పందించాల్సిన అవసరం లేదు: ఎంపీ గల్లా జయదేవ్

  • బాగా పని చేశాం.. పోరాటం చేశాం
  • మేమంతా టీడీపీలోనే కొనసాగుతాం
  • ముగ్గురం కలిసి పని చేస్తాం
  • జూనియర్, సీనియర్ అనే తేడాల్లేవు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో తాము బాగా పని చేశామని, పోరాటం చేశామని అందుకే ప్రజలు తమను మళ్లీ పార్లమెంటుకు పంపారని ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాని బీజేపీలోకి వెళుతున్నారన్న వార్తలను ఖండించారు. అసలు ఆ విషయంపై తాను, నాని స్పందించాల్సిన అవసరం కూడా లేదని, తామంతా టీడీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.

టీడీపీ తరుపున ఎన్నికైన ముగ్గురం కలిసి పని చేస్తామని, ఏ విషయమైనా ముగ్గురం మాట్లాడుకుని పని చేస్తామన్నారు. తమ మధ్య జూనియర్, సీనియర్ అని తేడాలు లేవన్నారు. టీడీపీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తాను, నాని మంచి స్నేహితులమని అందుకే తాను వ్యక్తిగతంగా నానిని కలిశానని, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు.

Telugudesam
BJP
Kesineni Nani
Galla Jayadev
Chandrababu
  • Loading...

More Telugu News