Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ తో సమావేశమైన వైఎస్ వివేకా కుమార్తె సునీత!

  • తండ్రి హత్యపై మళ్లీ మొదటి నుంచీ విచారణకు డిమాండ్
  • దాదాపు అరగంట సేపు జగన్ తో భేటీ
  • అంతకుముందు సవాంగ్ తో సమావేశమైన సీఎం

వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చిన సునీత అరగంట పాటు పలు అంశాలపై చర్చించారు.

వైఎస్ వివేకా హత్యకేసులో పురోగతితో పాటు పలు అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. వైఎస్ వివేకా హత్యకేసును మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు చేయించాలని ఈ సందర్భంగా సునీత ముఖ్యమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. డీజీపీ సవాంగ్ తో భేటీ ముగిసిన వెంటనే జగన్ వైఎస్ సునీతతో సమావేశం కావడం గమనార్హం.

Andhra Pradesh
Chief Minister
Jagan
ys sunita
meeting
  • Loading...

More Telugu News