Cricket: టీమిండియా కోసం ప్రత్యేక గీతాన్ని రూపొందించిన తెలుగుతేజం

  • కప్ మనదే అంటూ సాగే గీతం
  • రూపొందించిన ఫణి కృష్ణ
  • సామాజిక మాధ్యమాల్లో స్పందన

విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ లో తన ప్రస్థానం మొదలుపెట్టింది. దక్షిణాఫ్రికాతో సౌతాంప్టన్ లో మ్యాచ్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో, భారత జట్టును మెగా ఈవెంట్ లో ప్రోత్సహిస్తూ ఓ తెలుగు వ్యక్తి హుషారైన గీతాన్ని రూపొందించారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో సైంటిఫిక్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఫణి కృష్ణ, కప్ మనదే, వరల్డ్ కప్ మనదే అంటూ సాగే పాటకు రూపకల్పన చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ పాటకు విశేష ప్రాచుర్యం లభిస్తోంది.

  • Loading...

More Telugu News