Kesineni Nani: కేశినేని నానికి చంద్రబాబు ఫోన్.. సాయంత్రం ఇంటికి రావాలని ఆదేశం!

  • విజయవాడ టీడీపీలో ముదిరిన రాజకీయం
  • పార్టీ ఆఫీసు ఏర్పాటు విషయమై రగడ
  • లోక్ సభ టీడీపీ విప్ పదవిని తిరస్కరించిన నాని

కృష్ణా జిల్లా టీడీపీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నానికి టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ఈరోజు సాయంత్రం తన నివాసానికి రావాలని ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే తనతో చర్చించాలనీ, బయట అవనసరంగా మాట్లాడవద్దని సూచించారు. వెంటనే బయలుదేరి రావాలని స్పష్టం చేశారు. ఇందుకు కేశినేని నాని అంగీకరించారు.

లోక్ సభలో టీడీపీ విప్ గా ఉండాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించగా, దాన్ని కేశినేని నాని తిరస్కరించారు. ఇంత పెద్ద పదవికి తాను అనర్హుడిననీ, కాబట్టి వేరొకరికి ఈ బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబును కోరారు. తాను విజయవాడ లోక్ సభ సభ్యుడిగానే ప్రజలకు సేవ చేసుకుంటానని చెప్పారు. విజయవాడలో టీడీపీ కార్యాలయం ఏర్పాటు విషయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ, పార్టీ అధిష్ఠానం వైఖరితో నాని అసంతృప్తికి గురైనట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Kesineni Nani
Telugudesam
Chandrababu
phone
called home
  • Loading...

More Telugu News