Andhra Pradesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ పర్యటన రద్దు!

  • రేపు మంగళగిరి, విజయవాడలో పవన్ పర్యటన
  • అనారోగ్యం కారణంగా టూర్ రద్దు
  • మరో తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్న పార్టీ వర్గాలు

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలపై సమీక్షించుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు మంగళగిరి, విజయవాడలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనకు బ్రేక్ పడింది. పవన్ కల్యాణ్ ఈరోజు అనారోగ్యానికి గురి కావడంతో ఆయన విజయవాడ, మంగళగిరి పర్యటనను వాయిదా వేసుకున్నారు.

మళ్లీ పవన్ పర్యటన ఎప్పుడు ఉంటుందో త్వరలోనే ప్రకటిస్తామని జనసేన వర్గాలు తెలిపాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు సీటు మినహా 174 స్థానాల్లో జనసేన ఓటమి చవిచూసింది. ఇక లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతానే తెరవలేదు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అయితే పోటీచేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు.

Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
sick
tour cancelled
  • Loading...

More Telugu News