Virat Kohli: సెంటిమెంట్ ఫలిస్తే కోహ్లీ సెంచరీ, విజయం మనదేనట!

  • ఇప్పటివరకూ రెండు వరల్డ్ కప్ లు ఆడిన కోహ్లీ
  • రెండింటిలోనూ తొలి మ్యాచ్ లలో సెంచరీ
  • ఆ మ్యాచ్ లలో గెలిచిన భారత్

నేడు సౌతాఫ్రికాతో వరల్డ్ కప్ క్రికెట్ పోరులో భాగంగా భారత్ తొలి మ్యాచ్ ని ఆడనున్న వేళ, ఓ ఆసక్తికర సెంటిమెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోహ్లీ, ఇప్పటివరకూ రెండు వరల్డ్ కప్ లు ఆడాడన్న సంగతి చాలామందికి తెలుసు. ఈ రెండు వరల్డ్ కప్ లలోనూ భారత జట్టు, తన తొలి మ్యాచ్ లలో విజయం సాధించగా, ఈ రెండింటిలోనూ కోహ్లీ సెంచరీలు కొట్టాడు.

2011లో బంగ్లాదేశ్ తో మీర్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో 83 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ లో భారత్ గెలిచింది. ఇక, 2015లో ఆడిలైడ్ లో పాకిస్థాన్ తో భారత్ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో 126 బంతుల్లో కోహ్లీ 107 పరుగులు చేశాడు. ఇక నేటి మ్యాచ్ లో కూడా ఆనవాయితీగా వచ్చిన తొలి మ్యాచ్ సెంచరీని కోహ్లీ సాధిస్తాడని, భారత విజయం కూడా ఖాయమని అభిమానులు అంటున్నారు.

Virat Kohli
World Cup
Cricket
Century
  • Loading...

More Telugu News