BJP: బీజేపీలో చేరనున్నారన్న వార్తలపై స్పందించిన కేశినేని నాని!

  • ఇటీవలే నితిన్ గడ్కరీని కలిసిన నాని
  • టీడీపీ విప్ పదవి వద్దని తిరస్కరణ
  • బీజేపీలో చేరాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ

అసెంబ్లీ, లోక్ సభ ఫలితాలు వెల్లడైన తరువాత, తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని బీజేపీలో చేరనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సన్నాహకంగానే ఆయన నితిన్ గడ్కరీని కలిసి వచ్చారని కూడా ప్రచారం జరిగింది. తాజాగా ఆయన పార్టీ విప్ పదవిని తిరస్కరించి మరో సంచలనానికి తెరలేపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా నానికి పదవిని అప్పగించగా, ఆ పదవికి తాను అర్హుడిని కానని, అది ఇచ్చినందుకు ధన్యవాదాలని చెబుతూనే, మరో సమర్ధుడికి పదవిని ఇవ్వాలని కోరారు. ఇక బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై స్పందించిన నాని, తనకు ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. వస్తున్న వార్తలన్నీ అవాస్తవమేనని తేల్చి చెప్పారు.

BJP
Kesineni Nani
Nitin Gadkari
  • Loading...

More Telugu News