Telangana: జాతీయ రాజకీయాలపై దృష్టి.. టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా!

  • హైకమాండ్ కు విషయం చెప్పిన కాంగ్రెస్ నేత
  • నల్గొండ ఎంపీగా ఘనవిజయం
  • రేసులో కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీమానా చేయనున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఉత్తమ్ ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాలని ఉత్తమ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఇంకొకరిని ఎంపిక చేసుకోవాలని పార్టీ హైకమాండ్ కు ఉత్తమ్ స్పష్టం చేసినట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగు సంవత్సరాల మూడు నెలల పాటు పనిచేశారు. కాగా, ఉత్తమ్ తప్పుకోనున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ పదవికి కోమటిరెడ్డి సోదరులతో పాటు జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు వంటి హేమాహేమీ నేతలు పోటీ పడుతున్నారు.

Telangana
tpcc
Uttam Kumar Reddy
komati reddy
Revanth Reddy
jagga reddy
resign
Congress
high command
  • Loading...

More Telugu News