Andhra Pradesh: కోడెల స్పీకర్ పదవికే కళంకం తెచ్చారు.. రూ.4.5 కోట్లకు పైగా దోచుకున్నారు!: విజయసాయిరెడ్డి

  • ప్రజాధనాన్ని కోడెల దోపిడీ చేశారు
  • సౌకర్యాలు లేని తన భవనాల్లో కార్యాలయాలు పెట్టించారు
  • భారీగా అద్దె వసూలు చేశారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దోపిడీ చేసిన కోడెల స్పీకర్ పదవికే కళంకం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘ప్రజాధనం దోపిడీలో జులుం ప్రదర్శించి కోడెల స్పీకర్ పదవికే కళంకం తెచ్చారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీం, ఫార్మసీ కౌన్సిల్ ఆఫీసులను కనీస వసతులు కూడా లేని తన సొంత భవనంలో పెట్టించారు. చదరపు అడుగుకు రూ.16 అద్దె అయితే... పైరవీ చేసుకుని రూ.25 తీసుకున్నారు. నాలుగున్నర కోట్ల పైనే లూటీ చేశారు’ అని ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలపై కోడెల శివప్రసాదరావు ఇంతవరకూ స్పందించలేదు.

Andhra Pradesh
Telugudesam
kodela
YSRCP
Vijay Sai Reddy
Twitter
  • Loading...

More Telugu News