Cricket: వరల్డ్ కప్ మ్యాచ్ కి వానపోటు... ఆప్ఘనిస్థాన్ లక్ష్యం 187 రన్స్
- కార్డిఫ్ లో భారీ వర్షం
- మ్యాచ్ కు అంతరాయం
- శ్రీలంక 201 ఆలౌట్
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇవాళ శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ లో వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. శ్రీలంక జట్టు దారుణ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతున్న తరుణంలో కార్డిఫ్ లో భారీ వర్షం పడడంతో మ్యాచ్ చాలాసేపు నిలిచిపోయింది. అప్పటికి శ్రీలంక 33 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా, శ్రీలంక మరో 19 పరుగులు జతచేసి 201 పరుగులకు ఆలౌటైంది. అయితే కాలహరణం జరగడంతో డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా ఆఫ్ఘన్ జట్టు లక్ష్యాన్ని 41 ఓవర్లలో 187 పరుగులుగా నిర్దేశించారు. ప్రస్తుతం ఆఫ్ఘన్ జట్టు 3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది.