TRS: ఇప్పటి వరకూ 15కు పైగా జడ్పీలను తన ఖాతాలో వేసుకున్న టీఆర్ఎస్!

  • అసెంబ్లీ ఎన్నికల జోరు పునరావృతం
  • ఖమ్మంలోనూ కారు జోరు
  • సిద్దిపేట క్లీన్ స్వీప్

జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకెళుతోంది. అసెంబ్లీ ఫలితాల జోరును పరిషత్ ఎన్నికల్లోనూ కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే టీఆర్ఎస్ 15కు పైగా జడ్పీ పీఠాలను తన ఖాతాలో వేసుకోనుంది. ఈసారి ఖమ్మంలో కూడా టీఆర్ఎస్ తన జోరును కొనసాగిస్తుండటం విశేషం. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట జడ్పీలలో టీఆర్ఎస్ తన హవా కొనసాగిస్తోంది. సిద్దిపేటలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేసింది.  

TRS
Khammam
Karimnagar
Mahaboobnagar
Vanaparthy
Siddipet
  • Loading...

More Telugu News