Tirumala: శ్రీవారి అన్నప్రసాద భవనంలో భక్తులతో కలసి భోజనం చేసిన ఉపరాష్ట్రపతి

  • శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్యనాయుడు
  • ఉపరాష్ట్రపతికి మహాద్వారం వద్ద ఘన స్వాగతం
  • ఏడాదికి ఒక్కసారే స్వామివారిని దర్శించుకోవాలి

నేటి ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి వెళ్లిన వెంకయ్యనాయుడుకు మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం నేటి మధ్యాహ్నం ఆయన తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో సాధారణ భక్తులతో కలిసి సామూహిక భోజనం చేశారు. భక్తులకు మంచి రుచికరమైన, నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తున్న టీటీడీ అధికారులను ఆయన ప్రశంసించారు. ప్రముఖులైవరైనా సరే ఏడాదికి ఒక్కసారే స్వామి వారిని దర్శించుకోవాలని, సాధారణ భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా సూచించారు.

Tirumala
Vengamamba
Vykumtham
TTD
Venkaiah Naidu
  • Loading...

More Telugu News