vamsi paidipalli: ఎన్టీఆర్ .. చరణ్ మాటలు నాలో ఉత్సాహానికి ఊపిరిపోశాయి: వంశీ పైడిపల్లి

  • 'మున్నా' ఫ్లాప్ కావడంతో డీలాపడ్డాను
  •  చరణ్ నాకు ధైర్యం చెప్పాడు
  • ఎన్టీఆర్ అవకాశం ఇచ్చాడు  

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, తన కెరియర్లోని ఒడిదుడుకులను గురించి ప్రస్తావించారు. నా తొలి సినిమా 'మున్నా' పరాజయం పాలైన తరువాత నేను చాలా డీలాపడిపోయాను. నిరాశా నిస్పృహలతో రోజులు చాలా భారంగా గడుస్తున్నాయి.

అలాంటి పరిస్థితుల్లో ఓ కాఫీ షాప్ లో చరణ్ తారసపడి 'మున్నా' విషయం ప్రస్తావిస్తూ డైరెక్టర్ గా నేను ఫెయిల్ కాలేదని చెప్పాడు. ఆ తరువాత ఎన్టీఆర్ - దిల్ రాజు కూడా అదే మాట అనడంతో నాలో ఉత్సాహానికి ఊపిరిపోసినట్టు అయింది. అప్పుడు నేను మళ్లీ ఒక కథపై కూర్చుని కసరత్తుచేసి, దిల్ రాజు - ఎన్టీఆర్ లకు వినిపించాను. వాళ్లిద్దరికీ బాగా నచ్చేసిన ఆ కథే 'బృందావనం'. ఈ సినిమా తరువాత చరణ్ తో 'ఎవడు' చేశాను" అని చెప్పుకొచ్చారు. 

vamsi paidipalli
  • Loading...

More Telugu News