Tirupati: వృద్ధునిపై దాష్టీకం...కంట్లో కారంచల్లి కొడుకు, కోడలు దాడి

  • సహకరించిన కోడలి తమ్ముడు
  • నడివీధిలో అందరూ చూస్తుండగా దౌర్జన్యం
  • బాధితుడిని రుయా ఆసుపత్రికి తరలించిన స్థానికులు

కన్నతండ్రి...పైగా వృద్ధుడు...తనకు జీవితాన్నిచ్చిన అతని పట్ల  ప్రేమ, దయ, బాధ్యతగా వ్యవహరించాల్సిన కొడుకు మానవత్వం మరిచాడు. అతనికి భార్య కూడా తోడయింది. ఇద్దరూ కలిసి ఆ వృద్ధునిపై దాష్టీకానికి పాల్పడ్డారు. సభ్య సమాజం చూస్తుండగానే జరిగిన ఈ సంఘటన పలువురి నోట అయ్యో అనిపించగా, మరికొందరు కొడుకు, కోడలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి పట్టణంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. తిరుపతి అనంత వీధిలో  ఓ వృద్ధుడు కొడుకు, కోడలితో కలిసి ఉంటున్నాడు. తండ్రి పేరున ఉన్న ఆస్తి స్వాధీనం చేసుకునేందుకు సదరు పుత్రరత్నం ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం తండ్రిపై దౌర్జన్యానికి దిగాడు. తండ్రిని నడివీధిలోకి లాగి ఇనుపరాడ్డుతో  చితక బాదాడు. భర్తకు సాయంగా అతని భార్య మామ కళ్లలో కారం కొట్టి దౌర్జన్యానికి పాల్పడింది. ఆమెకు ఆమె సోదరుడు కూడా సహకరించాడు. వృద్ధుడి ఆర్తనాదాలు విన్న స్థానికులు వివాదంలో జోక్యం చేసుకుని అతన్ని రక్షించి స్థానిక రుయా ఆసుపత్రికి తరలించారు.

Tirupati
oldman
beten by son and daughter inlaw
  • Loading...

More Telugu News