batthina brother: శాస్త్రీయత లేని చేప మందు పంపిణీ వద్దు: హైకోర్టులో పిల్‌ దాఖలు

  • ఇటువంటి కార్యక్రమాలు చట్టవిరుద్ధమన్న పిటిషనర్‌
  • ఈ కార్యక్రమంతో ప్రభుత్వానికి వృథా వ్యయమని ఫిర్యాదు
  • ఈనెల 8, 9 తేదీల్లో చేప మందు పంపిణీకి ఏర్పాట్లు

ఉబ్బసం వ్యాధి నివారణకు అత్యద్భుత ఔషధమని గుర్తింపు పొంది దేశవ్యాప్తంగా ఉన్న రోగులను హైదరాబాద్‌కు వచ్చేలా చేస్తున్న చేపమందు ప్రసాదం పంపిణీని నిలిపి వేయాలని హైకోర్టులో లంచ్ మోషన్  పిటిషన్‌ దాఖలైంది. ఎటువంటి శాస్త్రీయ నిర్థారణలేని మందు ఇదని, ఇటువంటి మందు పంపిణీ చేయడం చట్టవిరుద్ధమని బాలల హక్కుల సంఘం ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. లక్షల్లో తరలి వచ్చే రోగులకు చేప మందు పంపిణీ కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వ్యయం చేసి భారీ ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రజాధనాన్ని వృథా చేయడమేనన్నారు. అందువల్ల తక్షణం ఈ కార్యక్రమాన్ని నిలిపి వేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, చేప మందు పంపిణికి ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌ వాసులు బత్తిన సోదరులు ఈనెల 8, 9 తేదీల్లో మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News