america: అమెరికాలోని సరస్సులో విశాఖ వాసి గల్లంతు!

  • బోటు షికారుకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం
  • ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లిన అవినాష్‌
  • ఎంఎస్‌ పూర్తిచేసి అక్కడే ఉద్యోగంలో చేరిక

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విశాఖ యువకుడు ఒకరు అక్కడి సరస్సులో బోటు షికారుకు వెళ్లి గల్లంతయ్యాడు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌కు చెందిన ఎ.వెంకటరావు కుమారుడు అవినాష్‌ ఐదేళ్ల క్రితం ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే ఎంఎస్‌ పూర్తిచేసి ఉద్యోగంలో చేరాడు.  వారాంతపు సెలవు రోజులు కావడంతో రెండు రోజుల క్రితం తాను ఉంటున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ సరస్సుకు వెళ్లాడు. బోటు షికారు చేద్దామన్న సరదాతో వెళ్లి ప్రమాదం బారిన పడినట్లు తెలుస్తోంది. సరస్సు లోతుగా ఉండడం, ఊబి కూడా  ఉండడంతో అవినాష్‌ కనిపించకుండా పోయాడని అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని అవినాష్‌ స్నేహితుడు టౌన్‌షిప్‌లో ఉన్న అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో టౌన్‌షిప్‌లో విషాదం అలముకుంది.

america
lake
accident
one missing
visakha steel township
  • Error fetching data: Network response was not ok

More Telugu News