Illayaraja: నోరు పారేసుకున్న ఇళయరాజా... వైరల్ వీడియో!

  • ఇటీవల 76వ పుట్టిన రోజు సందర్భంగా పాటకచేరీ
  • స్టేజ్ పైకి మంచినీరు తెచ్చిన సెక్యూరిటీ గార్డు
  • అనుమతి లేకుండా వచ్చావంటూ తిట్టిపోసిన ఇళయరాజా

ఇటీవలి కాలంలో అనుమతి లేకుండా తన పాటలను వాడుకుంటున్నారంటూ పలువురు సంగీత దర్శకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇళయరాజా, తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన 76వ పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో చెన్నైలో పాటకచేరీని నిర్వహించిన వేళ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాస్ తదితరుల సమక్షంలో ఓ సెక్యూరిటీ గార్డుపై విరుచుకుపడ్డారు. అతన్ని చెడామడా తిట్టారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. కార్యక్రమం జరుగుతుంటే, మంచి నీటిని అందించేందుకు స్టేజ్ పైకి రావడమే ఆ గార్డు చేసిన తప్పైంది. అడగకుండా ఎందుకు వచ్చావంటూ మండిపడ్డ ఇళయరాజా, ఆపై నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆ సెక్యూరిటీ గార్డు క్షమాపణలు కోరుతూ ఇళయరాజా కాళ్లు పట్టుకున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News