vamsi paidipalli: మధ్యమధ్యలో తలతిప్పి మహేశ్ బాబును చూసేవాడిని!: వంశీ పైడిపల్లి

  • దూరం నుంచి మహేశ్ ను చూసేవాడిని 
  • ఆయన వెనక కూర్చుని సినిమా చూసేవాడిని
  • ఆయన పక్కన కూర్చుంటానని అనుకోలేదు 

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. మహేశ్ బాబు 'మురారి' సినిమా చేసినప్పుడు నేను కూడా ఆ సినిమా చూడటానికి వెళ్లాను. థియేటర్లో ఆయనకి రెండు మూడు వరుసల ముందు కూర్చుని ఆ సినిమా చూశాను. మధ్యమధ్యలో తలతిప్పి మహేశ్ బాబును చూసేవాడిని.

ఇక 'ఒక్కడు' సినిమాను .. మహేశ్ బాబుకి నాలుగు వరుసల వెనక కూర్చుని చూశాను. కొంతకాలం తరువాత అదే మహేశ్ బాబుతో సినిమా చేస్తానని నేను ఎంతమాత్రం అనుకోలేదు. ఆయనతో చేసిన సినిమాను థియేటర్లలో ఆయన పక్కనే కూర్చుని చూస్తానని కూడా ఊహించలేదు. ఇది నా జీవితంలో ఒక తీపి జ్ఞాపకం అంతే" అని చెప్పుకొచ్చారు. 

vamsi paidipalli
  • Loading...

More Telugu News