vishwaksen: విష్వక్, తొందరపడి మాట్లాడొద్దు: దర్శకుడు తరుణ్ భాస్కర్ సలహా

  • విష్వక్ నాకు బాగా తెలుసు
  •  ఒక మాట పది రకాలుగా బయటికి వెళుతుంది 
  • సహనంతో ఉండటం మంచిది

విష్వక్సేన్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన 'ఫలక్ నుమా దాస్' క్రితం నెల 31వ తేదీన థియేటర్లకు వచ్చింది. వసూళ్ల పరంగా నైజామ్ లో ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనలు .. వాటిపై విష్వక్సేన్ స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది.

తాజాగా ఈ విషయంపై దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందించాడు. "విష్వక్సేన్ గురించి నాకు తెలుసు .. తను చాలా మంచివాడు. అప్పుడప్పుడు కొంచెం తొందరపడి మాట్లాడుతూ ఉంటాడు .. అది సరిదిద్దుకోవాలని నేను విష్వక్ కి చెబుతున్నాను. మనం ఒకటి మాట్లాడితే అది పది రకాలుగా బయటికి వెళుతూ ఉంటుంది. ఇలా నా విషయంలోను జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది. కాకపోతే ఆ సమయంలోనే సహనంతో ఉండవలసిన అవసరం వుంది" అని చెప్పుకొచ్చాడు. 

vishwaksen
tarun bhaskar
  • Loading...

More Telugu News