vamsi paidipalli: ప్రభాస్ సినిమా ఫ్లాప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను: వంశీ పైడిపల్లి

  • ప్రభాస్ హీరోగా 'మున్నా' తెరకెక్కించాను
  •  తొలి ప్రయత్నమే విఫలమైంది
  •  పరాజయం నుంచే పాఠం నేర్చుకున్నాను

స్టార్ హీరోలతో విభిన్నమైన కథా చిత్రాలను రూపొందిస్తూ .. విజయాలను అందుకుంటూ వంశీ పైడిపల్లి ముందుకు వెళుతున్నాడు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, 'మున్నా' సినిమాను గురించి ప్రస్తావించారు.

"ప్రభాస్ హీరోగా 'మున్నా' సినిమాను తెరకెక్కించాను. ఈ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. నా తొలి ప్రయత్నమే విఫలం కావడాన్ని జీర్ణించుకోలేకపోయాను. దాంతో ఏడాదికి పైగా అలా ఖాళీగా ఉండిపోయాను. అయితే ఖాళీగా వున్న ఆ సమయం నా కెరియర్ కి ఎంతో ఉపయోగపడింది. నన్ను నేను సరిచేసుకోవడానికి ఆ సమయం దోహదపడింది. 'మున్నా' పరాజయం నుంచే పాఠం నేర్చుకుని, ఆ తరువాత నుంచి మరింత జాగ్రత్తపడుతూ ఈ స్థాయివరకూ వచ్చాను" అని ఆయన చెప్పుకొచ్చారు.

vamsi paidipalli
  • Loading...

More Telugu News