Ponguleti Srinivasareddy: తెలంగాణ నేతకు వైఎస్ జగన్ బంపరాఫర్!

  • 2014లో ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి
  • ఆపై టీఆర్ఎస్ లో చేరినా, జగన్ పై అభిమానం
  • టీటీడీ బోర్డ్ మెంబర్ పదవి ఆఫర్

2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా విజయం సాధించి, ఆపై టీఆర్ఎస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏపీ సీఎం వైఎస్ జగన్ బంపరాఫర్ ఇచ్చారు. పార్టీ మారినప్పటికీ, జగన్ పై అభిమానాన్ని చూపిస్తూ వచ్చిన పొంగులేటికి టీటీడీ బోర్డ్ సభ్యుడి పదవిని జగన్ ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. టీటీడీ బోర్డు సభ్యుల్లో ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యాన్ని కల్పించే ఆనవాయితీలో భాగంగా తెలంగాణ నుంచి పొంగులేటిని నామినేట్ చేసేందుకు జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

Ponguleti Srinivasareddy
YSRCP
Jagan
Telangana
TTD
  • Loading...

More Telugu News