vamsi paidipalli: సినిమా అంటే పిచ్చి .. అందుకే సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి వచ్చాను: వంశీ పైడిపల్లి

  • మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం 
  • జయంత్ సి.పరాన్జీ టీమ్ లో ఛాన్స్
  •  'ఈశ్వర్' షూటింగులో ప్రభాస్ తో పరిచయం

'మహర్షి' సినిమాతో దర్శకుడిగా వంశీ పైడిపల్లి మరోసారి తన సత్తా చాటుకున్నారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే పిచ్చి. అందువలన సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకొని సినిమాలవైపు వచ్చాను. దర్శకుడు జయంత్ సి.పరాన్జీని కలిసి ఆయన టీమ్ లో ఛాన్స్ ఇవ్వమని అడిగాను. ఆ సమయంలో ఆయన ప్రభాస్ హీరోగా 'ఈశ్వర్' ప్లాన్ చేసుకుంటున్నారు. రేపటి నుంచి షూటింగు అనగా, ఆయన తన టీమ్ లో అవకాశం ఇచ్చారు. అలా 'ఈశ్వర్' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. ఆ సమయంలోనే ప్రభాస్ తో మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఆయనతో 'మున్నా' చేయడానికి కారణమైంది" అని చెప్పుకొచ్చారు.

vamsi paidipalli
  • Loading...

More Telugu News