Sri Lanka: లంకలో ముదిరిన రాజకీయ సంక్షోభం... 9 మంది ముస్లిం మంత్రుల రాజీనామా!

  • ఈస్టర్ నాడు చర్చ్ లపై ఆత్మాహుతి దాడులు
  • 250కి పైగా మృతి
  • ముస్లింలే కారణమంటూ ఆందోళనలు

శ్రీలంకలో ఈస్టర్ పండుగ వేళ జరిగిన ఆత్మాహుతి దాడుల తరువాత, రాజకీయ సంక్షోభం మరింతగా ముదిరింది. దాడులకు ముస్లింలే కారణమంటూ దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలకు దిగుతున్న వేళ, 9 మంది ముస్లిం మంత్రులు రాజీనామా చేశారు. వీరిలో న‌లుగురు క్యాబినెట్ హోదాలో ఉండటం గమనార్హం. మరో ఇద్దరు గవర్నర్లు కూడా రిజైన్ చేశారు. ఈస్ట‌ర్న్‌, వెస్ట‌ర్న్ ప్రావిన్సుల‌ గ‌వ‌ర్న‌ర్లు హిజ్‌ బుల్లా, ఆజాత్ స‌ల్లేలు తమ పదవులను వీడారు. దేశంలో ముస్లింలను అన్యాయంగా వేధిస్తున్నారని, చేయని తప్పుకు తమను హింసిస్తున్నారని ముస్లిం నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇదిలావుండగా, ముస్లిం మంత్రుల రాజీనామాలను డిమాండ్ చేస్తూ, ప్ర‌ఖ్యాత బౌద్ధ ఆల‌యం ముందు ఎంపీ అతుర‌లియే చేస్తున్న నిరాహార దీక్ష కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News