Venkaiah Naidu: వీఐపీలు సంవత్సరంలో ఒక్కసారే తిరుమల రావాలి: వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు!

- నిన్న తిరుమలకు వచ్చిన ఉపరాష్ట్రపతి
- నేడు స్వామివారి దర్శనం
- సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వెల్లడి
ప్రముఖులు, వీఐపీలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తిరుమలకు రావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. నిన్న తిరుమలకు వచ్చిన ఆయన, ఈ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వెంకయ్యనాయుడికి స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపలికి వచ్చిన తరువాత వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ, సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటే, ప్రముఖులు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే వస్తే బాగుంటుందని అన్నారు. దేవుడిని దర్శించుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుందన్నారు. అవినీతి, అసమానతలు, ఘర్షణలు, ఆకలిదప్పికలు లేని సమాజాన్ని తాను కోరుకుంటున్నానని అన్నారు.