Ada sharma: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రూటు మార్చిన ఆదాశర్మ
  • 'బిగ్ బాస్ 3' హోస్ట్ ఆయనే!
  • 'టైగర్ నాగేశ్వరరావు' అప్ డేట్  

*  గతంలో పలు తెలుగు సినిమాలలో నటించిన కథానాయిక ఆదాశర్మ ఇప్పుడు డిజిటల్ మీడియాకు కూడా వస్తోంది. తాజాగా ఆమె 'ద హాలిడే' అనే వెబ్ సీరీస్ లో నటిస్తోంది. దీని షూటింగ్ మారిషస్ లో నిర్వహిస్తారట.  
*  'బిగ్ బాస్ 3' తెలుగు టీవీ షోకి హోస్ట్ గా  గత కొంత కాలంగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అక్కినేని నాగార్జునతో సదరు నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది.
*  తాజాగా 'సీత' సినిమాలో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో గజదొంగ పాత్రను పోషించనున్నాడు. వంశీకృష్ణ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు నుంచి జరుగుతుంది.

More Telugu News