Jagan: నేడు శారదాపీఠాన్ని సందర్శించనున్న జగన్.. మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానం?

  • 8న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం
  • సలహాలు, సూచనలు తీసుకోనున్న సీఎం
  • సచివాలయ చాంబర్‌లోకి ప్రవేశంపై ముహూర్తం అడిగి తెలుసుకోనున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు విశాఖ శారదా పీఠాన్ని సందర్శించనున్నారు. ఈ నెల 8న జరగనున్న మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్వరూపానందేంద్ర స్వామిని జగన్ ఆహ్వానించనున్నట్టు సమాచారం. అలాగే, ప్రమాణ స్వీకారం, సచివాలయంలోని తన చాంబర్‌లోకి ప్రవేశించేందుకు అనువైన ముహూర్తం వంటి వాటిపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మరోవైపు, కేబినెట్ పదవి ఆశిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు పీఠాన్ని సందర్శించి స్వామి ఆశీస్సులు తీసుకుంటున్నారు. దీంతో నేతలతో పీఠం సందడిగా మారింది.  

Jagan
Andhra Pradesh
swami swaroopanandendra
Visakhapatnam District
  • Loading...

More Telugu News