indian: 13 మందితో బయల్దేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం మిస్సింగ్

  • అరుణాచల్ ప్రదేశ్ లోని మేచుకాకు వెళ్తుండగా మిస్సింగ్
  • విమానంలో క్రూ మెంబర్స్ తో పాటు 13 మంది ప్రయాణం
  • ఒంటి గంట సమయంలో గ్రౌండ్ స్టేషన్ తో కోల్పోయిన సంబంధాలు

భారత వాయుసేనకు చెందిన విమానం మిస్ అయినట్టు సమాచారం అందుతోంది. ఈ విమానంలో 8 మంది క్రూ మెంబర్స్ తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు ఏఎన్-32 ఎయిర్ క్రాఫ్ట్ అస్సామ్ లోని జోర్హట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని మేచుకాకు బయల్దేరింది. ఒంటి గంట సమయంలో గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలను కోల్పోయింది. విమానం ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

indian
airforce
aircraft
missing
  • Loading...

More Telugu News