mamata banerjee: మమతా బెనర్జీది హిరణ్యకశిపుడి వంశం!: బీజేపీ నేత సాక్షి మహారాజ్

  • మమత రాక్షస కుటుంబానికి చెందిన వ్యక్తి
  • జైశ్రీరామ్ అనే నినాదాన్ని వినలేకపోతున్నారు
  • జైశ్రీరామ్ అన్నవారిపట్ల అసహనానికి గురవుతున్నారు

పశ్చిమబెంగాల్ ముఖమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమత రాక్షస కుటుంబానికి చెందిన వ్యక్తి అని అన్నారు. నారాయణ మంత్రం జపించిన తన సొంత కుమారుడు ప్రహ్లాదుడినే హిరణ్యకశిపుడు జైలులో పెట్టించాడని... మమత కూడా హిరణ్యకశిపుడి వంటి వ్యక్తేనని అన్నారు. జైశ్రీరామ్ అనే నినాదాన్ని ఆమె వినలేకపోతున్నారని... దాన్ని ఉచ్చరించినవారి పట్ల ఆమె అసహనానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు.

పశ్చిమబెంగాల్ లో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల అనంతరం... బీజేపీ, టీఎంపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ఇటీవల మమత కాన్వాయ్ వెళుతున్న సమయంలో కొందరు బీజేపీ కార్యకర్తలు అడ్డుపడి, జైశ్రీరామ్ నినాదాలు చేసి, ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో, ఆమె కారు నుంచి కిందకు దిగి వారిని హెచ్చరించారు.

mamata banerjee
sakshi maharaj
bjp
tmc
  • Loading...

More Telugu News