Tamilnadu: తమిళనాట మారిన చట్టాలు... ఇక 24 గంటలూ పనిచేసే థియేటర్లు, దుకాణాలు, హోటళ్లు!

  • అమలులోకి రానున్న కొత్త చట్టం
  • రాత్రి 8 దాటితే మహిళా ఉద్యోగుల బాధ్యత సంస్థలదే
  • సిఫార్సులు చేసిన కార్మిక శాఖ
  • త్వరలోనే అధికారిక ఉత్తర్వులు

రాష్ట్రంలోని దుకాణాలు, కంపెనీలు వారంలోని అన్ని రోజులూ పని చేసుకోవచ్చని, 24 గంటలూ తెరచి ఉంచుకోవచ్చని చెబుతూ, పళనిస్వామి సర్కారు కొత్త చట్టాన్ని అమలు చేయనుంది. 2016లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విధుల నియంత్రణా మండలి, సేవలకు సంబంధించిన నిబంధనల చట్టం ప్రకారం, రాష్ట్రాలే తమ పరిధిలోని దుకాణాలు, సంస్థల పని గంటలను నిర్దేశించుకోవచ్చు.

ఈ చట్టం ప్రకారం, ఇప్పటికే మహారాష్ట్ర 24 గంటలు పని చేసేలా నిబంధనలను మార్చుకుంది. ఇప్పుడు తమిళనాడు కూడా అదే దారిలో నడుస్తోంది. మారనున్న చట్టం ప్రకారం, సినిమా థియేటర్లు, హోటళ్లు, దుకాణాలు, బ్యాంకులు సహా అన్ని రకాల పరిశ్రమలు నిరంతరాయంగా పని చేయవచ్చు. ఇక రాత్రిపూట పనిచేసే మహిళల భద్రతకు సంబంధించి ఆయా సంస్థల నుంచి లిఖిత పూర్వక హామీని తీసుకుని అనుమతి ఇవ్వనున్నారు.

త్వరలోనే కొత్త చట్టంపై ప్రకటన వెలువడుతుందని తమిళనాడు అధికారులు తెలిపారు. ఇప్పటికే కార్మిక శాఖ నుంచి ప్రభుత్వానికి దీనిపై సిఫార్సులు వెళ్లాయని, అధికారిక ప్రకటన సిద్ధమైందని పేర్కొన్నారు. వారం రోజులూ పని చేసే సంస్థలో ఎవరికి ఏ రోజు వీక్లీ ఆఫ్ అన్న వివరాల బోర్డు ఏర్పాటు తప్పనిసరని, ఓవర్ టైమ్ 10.30 గంటలకు మించరాదని కార్మిక శాఖ సిఫార్సు చేసింది. రాత్రి 8 దాటితే మహిళల భద్రత సంస్థలదేనని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News