central minister: సైకిల్‌పై వచ్చి బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి!

  • సైకిల్‌ డే సందర్భంగా తీసుకున్న నిర్ణయం
  • పర్యావరణ హితమని స్ఫూర్తిదాయక యత్నం
  • సైకిల్‌ ప్రయాణం ఆరోగ్యానికి మేలన్న మంత్రి

ఆరోగ్యాన్ని మించిన ధనం లేదంటారు పెద్దలు. మంత్రిగా మారిన వైద్యుడికి ఈ విషయం ప్రత్యేకించి చెప్పాలా? అందుకే ఆయన బాధ్యతల స్వీకారానికి ఆరోగ్యం, పర్యావరణ హితానికి ఉపయుక్తమయ్యే సైకిల్‌పై కార్యాలయానికి విచ్చేశారు. పదుగురికీ ఆదర్శంగా నిలిచారు.

వివరాల్లోకి వెళితే...దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీచౌక్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన డాక్టర్‌ హర్షవర్థన్‌కు కేంద్రమంత్రి వర్గంలో చోటు లభించిన విషయం తెలిసిందే. వృత్తిరీత్యా డాక్టర్‌ కావడం వల్ల బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే ఆరోగ్యకరమైన సూత్రాలు పాటించడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలవాలని భావించారు. పైగా ఈరోజు వరల్డ్‌ సైకిల్‌ డే కావడంతో సైకిల్‌పై తన కార్యాలయానికి వచ్చి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం మాట్లాడుతూ సైకిల్‌ అందుబాటులో ఉన్న రవాణా సాధనమేకాక ఆరోగ్యకరమైన అలవాటన్నారు. ఆరోగ్యమైన భారతవాని కోసం మోదీ దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధానమంత్రి జనయోజన పథకాలు ప్రజలకు చేరేలా చూస్తామన్నారు.

  • Loading...

More Telugu News