Hyderabad: హైదరాబాద్ హోటల్ లో పోలీసులకు పట్టుబడిన కాలేజ్ స్టూడెంట్స్, ప్రేమజంటలు!

  • తాడ్ బండ్ చౌరస్తా హోటల్ లో అశ్లీల కార్యకలాపాలు
  • పోలీసులకు అందిన సమాచారం
  • యువతీ, యువకులకు కౌన్సెలింగ్, హోటల్ పై కేసు

హైదరాబాద్ బోయిన్ పల్లి పరిధిలోని తాడ్ బండ్ చౌరస్తాలో ఉన్న హోటల్ లో యువతీ యువకులు అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తమకు వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన నార్త్ జోన్ పోలీసులు, ఆ హోటల్ పై దాడులు చేయగా, నగరంలోని పలు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు, ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ప్రేమజంటలు పట్టుబడటం కలకలం రేపింది.

బోయిన్ పల్లి సీఐ రాజేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం, 18 నుంచి 25 ఏళ్ల వయసున్న కొందరు హోటల్ లో అభ్యంతరకర పనులు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే హోటల్ పై దాడులు చేయగా, వీరి నుంచి సరైన ధ్రువీకరణ పత్రాలను హోటల్ మేనేజ్ మెంట్ తీసుకోలేదని, వారు ఎందుకు వచ్చారో అడగలేదని, రిజిస్టర్ లో ఎవరి పేర్లూ లేవని గుర్తించారు. హోటల్ నిబంధనలకు విరుద్ధంగా పాల్పడినందుకు యాజమాన్యంపై కేసును నమోదు చేశామని, తమకు పట్టుబడిన యువతీ, యువకులను అదుపులోకి తీసుకుని, కౌన్సెలింగ్ ఇచ్చామని, వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టామని తెలిపారు.

Hyderabad
Tadbund
Lovers
Holtel
Students
  • Loading...

More Telugu News