murali mohan: మురళీ మోహన్‌ను పరామర్శించిన చంద్రబాబు, లోకేశ్

  • వెన్నుపూస ఆపరేషన్ చేయించుకున్న మురళీమోహన్
  • మురళీమోహన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు
  • కుటుంబసభ్యులతో మాట్లాడిన టీడీపీ అధినేత

టీడీపీ మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ వెన్నుపూస ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాదులోని తన నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శించారు. తాజాగా ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ కుటుంబసభ్యులతో వారు ముచ్చటించారు. మరోవైపు... తాను కోలుకుంటున్నానని, త్వరలోనే ఆపరేషన్ కుట్లు తీస్తారని ఓ వీడియో ద్వారా మురళీమోహన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

murali mohan
chandrababu
nara lokesh
  • Loading...

More Telugu News