Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి శస్త్రచికిత్స పూర్తి!

  • కీళ్ల సంబంధ వ్యాధితో బాధపడిన పోసాని
  • ఆపరేషన్ ను పూర్తి చేసిన వైద్యులు
  • పరామర్శించిన వైసీపీ నేతలు, సినీ ప్రముఖులు

కీళ్ల సంబంధ వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళికి శస్త్రచికిత్స పూర్తయింది. ఆయన ఇటీవల హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేరగా, పలువురు వైసీపీ నేతలు, సినీ ప్రముఖులు పరామర్శించిన విషయం తెలిసిందే. తనకు నడుము కింది భాగంలో గజ్జల్లో ఇబ్బందిగా ఉందని, దాని వల్ల సరిగా నడవలేక పోతున్నానని ఇటీవల పోసాని మీడియా ముందు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారని, 'మహర్షి' సహా కొన్ని సినిమాల షూటింగ్ ఆగరాదన్న ఉద్దేశంతో వాయిదా వేసుకుంటూ వచ్చానని ఆయన అప్పట్లో చెప్పారు. తాజాగా పోసానికి ఆపరేషన్ చేసిన వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని వెల్లడించారు.

Posani Krishna Murali
Operation
YSRCP
  • Loading...

More Telugu News