Sandra: తప్పిన పెను ప్రమాదం... దేవుడే బతికించాడన్న ఎమ్మెల్యే సండ్ర!

  • కాలువలోకి జారిపోయిన కారు
  • ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం
  • ఖమ్మం పరేడ్ గ్రౌండ్ సమీపంలో ఘటన

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగగా, ఖమ్మం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లో జరిగిన ఉత్సవాలకు హాజరైన సండ్ర అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన వేళ ప్రమాదం జరిగింది. ఇక్కడికి సమీపంలోనే ఉన్న ఓ శివాలయం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన కారు డ్రైవర్, పక్కనే ఉన్న కాలువను గమనించలేదు. దీంతో వాహనం కాలువలోకి జారిపోయింది.

డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కారు బోల్తా పడలేదు. వాహనం ఒరిగిపోతున్న సమయంలో సండ్ర, ఆయన గన్ మెన్ లు కిందకు దిగేశారు. ఆ శివుడే తన ప్రాణాలను కాపాడాడని వ్యాఖ్యానించిన సండ్ర, ఆపై తన ప్రయాణాన్ని కొనసాగించారు. తమ ఎమ్మెల్యేకు ఏమీ జరుగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Sandra
Road Accident
Khammam District
  • Loading...

More Telugu News