Koushalendra: భర్త పెట్టే హింసను భరించలేక దుడ్డు కర్రతో మోది హత్య చేసిన నేవీ ఉద్యోగి భార్య

  • శనివారం తాగి వచ్చి భార్యపై దాడి
  • ఇరుగు పొరుగుకు బాధను వెల్లడించిన భార్య
  • మళ్లీ ఆమెపై దాడికి పాల్పడిన కౌశలేంద్ర

భర్త పెట్టే హింసను ఏళ్ల తరబడి భరించిన భార్య ఇక సహించలేక దుడ్డుకర్రతో మోది చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణ గోవాలోని వాస్కో సబ్ జిల్లాలో ఉన్న నేవల్ బేస్‌లో ఐఎన్ఎస్ హన్స నౌకలో ఎయిర్‌క్రాఫ్ట్ విభాగంలో కౌశలేంద్ర సింగ్ పని చేస్తున్నాడు. అతను తరచూ ఇంటికి తాగి వచ్చి భార్యను చితకబాదేవాడు. కొన్నేళ్ల పాటు కౌశలేంద్ర హింసను ఆమె భరించింది.

శనివారం రాత్రి బాగా తాగి వచ్చిన కౌశలేంద్ర భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమె ఇరుగు పొరుగు వారికి తన బాధను వెల్లడించింది. వారు వెళ్లగానే మరోమారు ఆమెపై కౌశలేంద్ర దాడికి తెగబడ్డాడు. ఇక సహించలేకపోయిన ఆమె అతను నిద్రలోకి జారుకోగానే దుడ్డుకర్రతో తలపై బలంగా మోదింది. గాయాలపాలైన కౌశలేంద్రను చూడగానే భయపడిపోయిన భార్య ఇరుగు పొరుగు సాయంతో నేవల్ ఆసుపత్రికి తరలించింది. అయితే అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్థారించడంతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

Koushalendra
Air Craft
South Goa
Navel Hospital
Police
  • Loading...

More Telugu News