Telangana: ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అవమానం.. తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్ నేత!

  • నేడు ములుగులో రాష్ట్ర అవతరణ వేడుకలు
  • ఆదివాసీని కాబట్టే అవమానించారన్న సీతక్క
  • టీఆర్ఎస్ నేతలకు అధికారులు భయపడుతున్నారని వ్యాఖ్య

తెలంగాణలో ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత సీతక్కకు అవమానం జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీతక్కను అధికారులు వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆదివాసీని కాబట్టే అధికారులు తనను అవమానించారని సీతక్క ఆరోపించారు.

టీఆర్ఎస్ నేతలకు అధికారులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తనను అవమానిస్తే ములుగు నియోజకవర్గ ప్రజలను అవమానించినట్లేనని స్పష్టం చేశారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీతక్క టీఆర్ఎస్ అభ్యర్థి చందులాల్‌పై 18,423 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.

Telangana
mulugu
Congress
seetakka
  • Loading...

More Telugu News