formation day: తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలి : రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌

  • రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు
  • దేశాభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్న పౌరులున్న రాష్ట్రం తెలంగాణ
  • అభినందనలు తెలియజేసిన ప్రధాని మోదీ

దేశాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వీరు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.  రాష్ట్రం అభివృద్ధి పథాన దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు రాష్ట్రపతి, ప్రధాని ఆకాంక్షించారు.

ఇదే సమయంలో ప్రధాని మోదీ ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి పథాన దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు  రాష్ట్ర ప్రజల్ని ఆమె ట్విట్టర్‌ వేదికగా అభినందించారు. మరిన్ని విజయాలు మీరు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.

formation day
President Of India
Prime Minister
wishes
  • Loading...

More Telugu News