Telangana: చిరకాల వాంఛ నెరవేరిన రోజిది: కేటీఆర్

  • రాష్ట్రం కోసం 60 ఏళ్లు పోరాడాం
  • బంగారు తెలంగాణ సాధనకు పునరంకితం
  • ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్

మూడున్నర కోట్ల మంది తెలంగాణ వాసుల చిరకాల వాంఛ నెరవేరిన రోజు ఇదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా సాగుతున్న వేళ, కేటీఆర్ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాల పాటు పోరాడిన ప్రజలు విజయం సాధించిన రోజని, బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌ లో జరిగిన వేడుకలకు హాజరైన ఆయన, తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలకు పుష్పాంజలి సమర్పించారు. ఆపై జాతీయ పతాకాన్ని కేటీఆర్ ఎగురవేశారు. ఆపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు స్వపరిపాలనలో బంగారు తెలంగాణ పునాది పడిన రోజు జూన్ 2. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు" అని ఆయన అన్నారు.



Telangana
Formation Day
KTR
  • Loading...

More Telugu News