Sun: ఉడికిపోతున్న రాజస్థాన్... దేశంలోనే అత్యధికంగా 50.8 డిగ్రీల ఉష్ణోగ్రత!

  • ఎండ వేడిమితో ప్రజలకు ఇబ్బందులు
  • బికనీర్ లో 47.9, జైసల్మేర్ లో 47.2 డిగ్రీల వేడిమి
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు

భానుడి ప్రకోపానికి ఉత్తరాది అల్లాడుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ లో సాధారణం కన్నా 9 డిగ్రీల వరకూ అధికంగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని చూరు ప్రాంతంలో 50.8 డిగ్రీల అధ్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్ లో ఇంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారని జైపూర్ లోని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. గంగానగర్ లో 49 డిగ్రీలు, బికనీర్ లో 47.9 డిగ్రీలు, జైసల్మేర్ లో 47.2 డిగ్రీలు, కోటాలో 46 డిగ్రీలు, జోధ్ పూర్ లో 45.6 డిగ్రీల వేడిమి నమోదైంది. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే విధమైన వేడిమి ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.

Sun
Rajasthan
Heat
  • Error fetching data: Network response was not ok

More Telugu News