VH: ఈ గవర్నర్ వద్దే వద్దు: వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

  • ముఖ్యమంత్రులకు భజన చేయడమే ఆయన పని
  • అన్యాయాలు జరుగుతున్నా స్పందించడం లేదు
  • తప్పించాలని హోమ్ శాఖను కోరనున్నామన్న వీహెచ్

ముఖ్యమంత్రులకు భజన చేయడం, వీలున్నప్పుడల్లా గుడులకు వెళ్లి రావడం మినహా మరేమీ చేయని గవర్నర్ నరసింహన్ ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇటువంటి గవర్నర్ తమకు వద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రతిఫలం కోసం పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించిన వీహెచ్, రైతులకు బేడీలు వేసినా, దళితులపై దాడులు జరిగినా గవర్నర్ స్పందించలేదని ఆరోపించారు. గవర్నర్ ను తప్పించాలని కేంద్ర హోమ్ శాఖను కోరనున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదని కేసీఆర్ కోరుకుంటుంటే, గవర్నర్ కూడా అదే విధమైన భావనలో ఉన్నారని ఆరోపించారు.

VH
Andhra Pradesh
Telangana
Narasimhan
  • Loading...

More Telugu News