vice president: జగన్‌, కేసీఆర్‌ కలిసి సాగడం అభినందనీయం : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • తెలుగు రాష్ట్రాలకు ఇది మేలు చేసే ప్రయత్నం
  • పెండింగ్‌ అంశాల పరిష్కారం దిశగా అడుగులు
  • వారి ప్రయత్నం సఫలం కావాలని ఆశిస్తున్నా

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డిలు పరస్పరం సుహృద్భావ వాతావరణంలో కలిసి నడవాలని చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజు ఆయన విశాఖలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ, నవ్యాంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోదరభావంతో మెలగడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతుందని, ఇది స్వాగతించాల్సిన అంశమని చెప్పారు.

ఐదేళ్ల నుంచి ఎటూ తేలని వివాదాల విషయంలో ఇరు రాష్ట్రాలు ఉమ్మడి అవగాహనతో ముందుకు నడిచి వాటి పరిష్కారానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం జోక్యం లేకుండా పరిష్కరించుకుంటే ఇంకా మంచిదన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రయత్నం సఫలం కావాలని తాను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానన్నారు. గడచిన ఐదేళ్లలోనూ తాను ఇదే కోరుకున్నానని, అనుకోని కారణాల వల్ల ఇది సాధ్యంకాకపోవడం నిరాశ కలిగించిందన్నారు. పాలనా సౌలభ్యం, సత్వర అభివృద్ధి కోసం రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

vice president
Venkaiah Naidu
KCR
Jagan
  • Loading...

More Telugu News