Andhra Pradesh: దుర్గమ్మగుడిలో క్షుద్రపూజలు.. మళ్లీ విచారణకు ఆదేశించనున్న జగన్ ప్రభుత్వం!

  • దుర్గ గుడిలో ప్రక్షాళనపై ఏపీ ప్రభుత్వం దృష్టి
  • పలువురు ఉద్యోగులకు స్థానచలనం కలిగే ఛాన్స్
  • సీఎం జగన్ కు సమాచారం చేరవేసిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ గుడిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక్కడ ఏళ్లుగా తిష్టవేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోెంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల బాధ్యతలు స్వీకరించే ముందు అమ్మవారిని దర్శించుకున్నారు. అప్పుడే ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను కొందరు అధికారులు ఏపీ సీఎం దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం.

అన్నదానం, ఉపాలయాలు, ఈవో కార్యాలయం, అమ్మవారి గర్భగుడి వంటిచోట కొందరు ఉద్యోగులు ఏళ్లుగా పాతుకుపోయారు. ఇక్కడి సిబ్బంది ఈవోకు అనుకూలంగా, వ్యతిరేకంగా రెండు గ్రూపులుగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు కనకదుర్గమ్మ ఆలయంలో గతేడాది డిసెంబర్ 26న అర్ధరాత్రి క్షుద్రపూజలు జరిగాయని  వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి కొందరిపై వేటు వేసిన అప్పటి ప్రభుత్వం, విచారణ కమిటీని నియమించింది. తాజాగా వైఎస్ జగన్ ఇప్పుడు ఈ వ్యవహారంపై తాజాగా మళ్లీ విచారణకు ఆదేశించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Andhra Pradesh
Jagan
Chief Minister
durga temple
Vijayawada
  • Loading...

More Telugu News