Andhra Pradesh: పల్నాడు ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తూ ఆసక్తికర విషయం చెప్పిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే!

  • బేగంపేట నుంచి గుంటూరుకు ప్రయాణం
  • రైలులో పరిచయమైన 50 మంది యువకులు
  • ట్విట్టర్ లో స్పందించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఈరోజు తాను పల్నాడు ఎక్స్ ప్రెస్ లో బేగంపేట నుంచి గుంటూరుకు వచ్చానని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక‌ృష్ణారెడ్డి తెలిపారు. ఈ రైలులో గురజాలలోని తంగెడ గ్రామానికి చెందిన దాదాపు 50 మంది యువకులు తనకు పరిచయం అయ్యారని వెల్లడించారు.

వైసీపీ అధినేత జగన్ సీఎం కావాలనీ వీరంతా మొక్కుకున్నారనీ, ఇప్పుడు మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళుతున్నట్లు వారంతా చెప్పారని పేర్కొన్నారు. ఇలాంటివారు ఏపీలో చాలామంది ఉన్నారని ఆర్కే అన్నారు. ఈ మేరకు ఈరోజు ఆర్కే ట్వీట్ చేశారు.

Andhra Pradesh
PALNADU EXPRESS
YSRCP
alla ramakrishna reddy
mangalagiri
Twitter
  • Loading...

More Telugu News